Tuesday, May 30, 2023

కరోన vs భీమశంకరం

 


 

డా. జాడ సీతాపతి రావు, సహాయకాచార్యులు

రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం, నూజీవీడు,

కృష్ణాజిల్లా- 521202. చరవాణి: 9951171299

Email seethuphd@gmail.com  

 

 

బ్రహ్మ తప్పస్సుతో శక్తి పొందిన మహమ్మారి కర్కసి

పీడించే శక్తితో చెప్పలేని హింసకు సూదిగా వెలసేవు

 

శ్రీరాముడి సంహారం నీ జాతికి వికారి

నువ్వేమో శార్వరి బ్రతుకంతా ఎడారి

 

నువు పొందిన బలాత్కారం, నిను గర్భిణీ చేసిన కుంభకర్ణుడు

మీ సాంగత్యం భీముడు, బ్రహ్మ వరాలు నీ శక్తికి ద్విగుణితాలు

 

నీవంశం నాశనం చేసిన వైద్యుడు, విష్ణువు

నీ బంధువుల్ని చంపిన విలుకాడు, రాముడు

 

కొడుకుని రెచ్చకొట్టి కోటి మందిని పొట్టపెట్టుకొని

కర్కసే కరోనాగా అవతరించిన మాహా కామి

 

నీ పుత్రుని సంహరించిన లయకారుడు, శివుడు

నీ భక్తికి వరమించిన ముక్కంటి, భీమశంకరం

 

ఆ భీమశంకరుడు లోక రక్షసుడై, మానవాళికి మహేశ్వరుడై

“యో డాకిని శాకినికా సమాజే, నిషేవ్యమానం పిశితాశానైశ్చ

సదైవ భీమాది పద ప్రసిద్ధం, తం శంకరం భక్తహితం నమామి”

కీర్తనలతో మానస భక్తితో యేకాంతంగా స్మరించిన దీవించు...

 

కప్పలు, తెప్పలుగా కుప్పలుగా తినే వారు, ఎద్దుల్ని, బల్లుల్ని

ఒకటేమిటి సమస్తం వారి  కర్కస స్వాహా దేవికి దాసోహం

 

బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం, బ్రహ్మ చెప్పిన విషూచిక,

యోగ వాసిష్టం, ఉచ్చ్వాసనిచ్చే శక్తుల స్వరాలు, మంత్రాలు

 

ఓం హ్రీం హ్రాం రీం రాం విష్ణు శక్తయే నమః

ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం

ఓం హరహర నయనయ పచపచ మథమథ

ఉత్సాదయ దూరే కురు స్వాహా హిమవంతం గచ్ఛ జీవ

సః సః సః చంద్రమండల గతోసి స్వాహా!

 

అంటూ స్మరించే సంస్కారుల్ని గౌరవంగా వదులు, లేదంటే

హిమాలయానికో చంద్రమండలానికి పో..  పిల్లల్ని వదులు...

ఆకాశం నీకు ఉత్తమ గతి, మంచిగా చెబుతున్నా విను ...

 

చెడ్డవారిని, మేధస్సును తప్పుగా వాడిన వారిని వెతికి తిను,

సేవలు చేసే నిష్కామ కర్ములకు నువ్వే మీ చేయకు...

ఇక్కడితో నీ కోరిక నెరవేరింది ఇకపై శాంతించు...

ఓం నమోభీమశంకరం లోక పీడన రాక్షసానాం రక్ష రక్ష

No comments: