డా. జాడ సీతాపతి రావు, సహాయకాచార్యులు
రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం, నూజీవీడు,
కృష్ణాజిల్లా- 521202. చరవాణి: 9951171299
Email seethuphd@gmail.com
కరోనా నీ యుక్తి నీ శక్తి నీ భుక్తి
నీకు సరిలేరు ఏ వైరెస్సులు
మనిషిని చంపే సేవకు పతాక స్థాయిగా
మానవతను మంటకలపడమే నువ్వు
ఇండోనేషియా హైడయో ఆలీ[1] సేవకు
దేశం మానవ తత్త్వం నీకు జోహార్
చెబుతున్నా నీకు సరిలేరు డాక్టర్
నీ యవ్వనం నీ సేవకు ఏమివ్వగలం?
చిన్నారి బిడ్డలతో అందమైన భార్యతో
కరోనా వచ్చిందని తెలిసినా బిడ్డల్ని చూస్తూ
అందమైన మీ మనసుకు ప్రపంచం చేతులు
జోడించి మీ జీవితాన్ని దైవికంగా భావించాలి
చిరునవ్వు చెదరని మీ ధీశక్తి, సేవాశక్తి
ఎంత జాగ్రత్తలు తీసుకున్నా వచ్చిన వైరస్
గేటు వెలుపల నిలబడి వీడ్కోలు తీసుకోడానికి వచ్చిన
కడసారి మీ చూపు మానవ హృదయాన్ని తాకింది
కరోనా తీవ్రతకు వేదన వియల తాండవించింది
మానవ జాతికి తీవ్రమైన హెచ్చరికలు చేసింది
మేలుకో యువతా భవితా కరోనా రక్కసికి
బలై నీ బతుకును బుగ్గి పాలు కానీకు
డాక్టర్ హైడియో అలీ నీకీదే జోహార్
మళ్ళీ డాక్టర్ గానే పుట్టు పుడమి తల్లి
పురిటి నొప్పుల్ని సున్నితంగా మార్చు
నీ కీదే ప్రపంచపు నమస్కారాలు
[1] ఇండోనేషియాకు చెందిన డాక్టర్ హైడియో అలీ చివరి చిత్రం ఇది, కరోనా వైరస్ రోగులకు చికిత్స చేస్తున్నప్పుడు కరోనాకు సోకింది. తాను బతకను అని భావించి, అతను ఇంటికి వెళ్లి గేటు వెలుపల నిలబడి, తన పిల్లలను, గర్భిణీ భార్యను చివరిసారిగా చూస్తూ, ఆపై వెళ్లిపోయాడు, ఈ చిత్రాన్ని అతని భార్య తీసింది. అతను తన పిల్లలను హృదయపూర్వకంగా చూడటానికి, వారి వీడ్కోలు తీసుకోవడానికి వచ్చినప్పుడు, అతను చాలా దూరంగా నిలబడ్డాడు, తన బీబీ పిల్లలకు వైరస్ రావాలని అతను కోరుకోలేదు. డాక్టర్ హైడియో అలీ మానవుడిగా దేవదూత ఆ వైద్యుడికి వందనం
No comments:
Post a Comment