Tuesday, May 30, 2023

చైనా నీ సంస్కారం ఎక్కడ?

 

డా. జాడ సీతాపతి రావు, సహాయకాచార్యులు

రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం, నూజీవీడు,

కృష్ణాజిల్లా- 521202. చరవాణి: 9951171299

                                                                                                       Email seethuphd@gmail.com  

గొడ్డుల్ని గబ్బిలాల్ని లాంటివి తినవద్దని మొత్తుకున్నా

నా ఆహారం నీ కేం తెల్సు వాటి మహమ్మారి రుచి

పేడ పురుగుల్ని పెసలు వేయించుకుని తినే దృష్టి

తిండికేదీ అనర్హం కాదా? చైనా నీ బుద్ధి ఎందాక?

 

అంతా శాకాహారమే తినమని కాదు నీ తెలివిలో

బహు జన జంతు జీవన సంస్కృతిని ప్రేమించు

ఆల్గేని వదలవు, అడవుల్ని ఉంచవు, అదే నీ ప్రకృతా?

ప్రాణ వాయువును మరణ వాయువుగా మారుస్తావా?

 

యుద్ధ కాంక్ష, సామ్యవాదపు పెత్తందారువా?

చిన్ని ఉత్తర కొరియాకు మారణ శక్తిలా మారావా?

అందాల ఫిలిప్పైన్స్ ను అంతరింప జేస్తున్నావా?

యుద్ధం వైపు సిద్ధంగా బయో వార్ నీ మతమా?

 

నీ పూర్వులు, నీ వైభవం తలచుకో చక్కని చైనీ సిల్క్

చైనీ చీనాంబరాలు, అగ్గిపెట్టిలో పెట్టిన సమయం

అగ్గే పెట్టెలా ఆలోచించి మానవ హోమం గా మారకు

ప్రకృతే వికృతయితే నీ దేశం భూతాలకు బలౌతుంది.

No comments: