Tuesday, May 30, 2023

సూరీడు సాక్షిగా... విజయం సాధిద్దాం

 

డా. జాడ సీతాపతి రావు, సహాయకాచార్యులు

రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం, నూజీవీడు,

                                                                        కృష్ణాజిల్లా- 521202. చరవాణి: 9951171299

ఓలమ్మ, కరోనా పారొచ్చిందట... భయం భయం వద్దు...

ఎక్కడో ఇదేశస్తులు ఇక్కడంటించారట

ఎవుడో ఆడు. ఎవుడికీ తెలుసుద్ది, ప్రతీ వోడూ అనడమే

సికాకుళం కోడి రామ్మూర్తి, కరణం మల్లేశ్వరుల పుట్టినిల్లు ... 

 

అసలు సికాకులమోళ్ళకి కరోనా రాదు....

అరసవెల్లి సూరీడిక్కడే ఉన్నాడు, సూసుకుంటాడు

జాగ్రత్తగా మూతి బుట్ట కట్టేసే బయటకి వత్తారు

సికాకుళం వోల్లికి సుద్ధి ఎక్కువని ఎవడికి తెల్సు?

 

సిక్కోలులోనే మంచివన్ని మొదలౌతాయ్

రోడెక్కితే పోలీసోళ్ళు కొట్టేత్తర్నంటన్రు

ఉత్తరకొరియాలో కాల్సేమన్నాడు, కిమ్ దొర, కరోనా అంటే.

ఎంత పెమాదమో ఇంకెలగ సెప్పాలి

 

రైతు కష్టం, కూలి నష్టం తప్పదు.. ఒకడికొకరం

తోడు పడాలి, మనం మనుషులం. మట్టి మనుషులం...    

సుట్ట ముక్క, మందు సుక్క నేకపోతే ఏమై పోతామ్

కలో గంజి తినైనా మనందరీనీ బతికించుకుందాం

 

నేలతల్లికున్న ప్రేమను మనం సూపాలి, దండాలెట్టుకోండి

సేకింగ్  హేండ్ ఇవ్వద్దు, సెయ్యలు తోముడు మరువద్దు

కరోనాతో కయ్యం, శుభ్రతతో వియ్యంగా ఉందుము....

ఇది పేదోడి అందరినీ మొక్కీ పేర్దన...  

 

సదువు లేనోడు పొలంకి ఎల్తుంటే, రైతుకీ కరోనా కష్టమే

చదువుకున్నాడో చక్కగుండాలి, కానీ పనిలేక ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు

భౌతిక దూరం తప్పదని తెలుసుకొని కరోనాని ఎదురిద్దామ్

స్వాతంత్ర సమరం కోసం జైళ్ళలో మగ్గిన మహనీయులు ఎందరో

 

ప్రపంచమే ఆరోగ్య అంత్యవసరం స్థితి, ఇంట్లోనే ఉందాం,

అజాగ్రత్త అజగరమై మింగేస్తుంది.... మందస్తు జాగ్రత్త  ముఖ్యం

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుందాం పోలీసులకు, ప్రభుత్వానికీ సహకరిద్దాం  

మనల్ని పక్కవాళ్లను కాపాడుకుందాం, సూరీడు సాక్షిగా విజయం సాధిద్దాం

 

 

 

No comments: