-డా.జె. సీతాపతి రావు, తెలుగు ఉపన్యాసకులు,
ఆర్. జి. యూ. కే. టి., ఏ. పి. ఐ. ఐ. ఐ. టి.,
నూజివీడు, కృష్ణాజిల్లా-521202.
విద్యులేఖ: seethuphd@gmail.com
సంచారవాణి: 9951171299
ప్రయోగం |
పదార్థం/ వస్తువు |
ధర్మం/ రుచి/రంగు |
పరీక్షావిధానం |
వచ్చిన ఫలితస్థితి |
ప్రయోగం ఫలం సమానం/ వ్యతిరేకం |
||
1 |
ఉప్పు |
ఉప్పగా ఉండును |
నీటిలో వేయడం |
కరిగింది/ మునిగింది |
వ్యతిరేకం |
||
కర్పూరం |
వగరు |
నీటిలో వేయడం |
తేలింది/ ఆవిరయ్యింది |
||||
2 |
ఉప్పు |
ఉప్పగా ఉండును |
అగ్నిలో వేయడం |
పేలింది |
వ్యతిరేకం |
||
కర్పూరం |
వగరు |
అగ్నిలో వేయడం |
కాలింది |
||||
3 |
ఉప్పు |
తెల్లగా |
రంగును పరిశీలించుట |
తెలుపు రంగు |
అనుకూలం |
||
కర్పూరం |
తెల్లగా |
రంగును పరిశీలించుట |
తెలుపు రంగు |
||||
4 |
ఉప్పు |
ఉప్పగా ఉండును |
నోట్లో వేయడం |
ఉప్పగా ఉండును |
వ్యతిరేకం |
||
కర్పూరం |
వగరు |
నోట్లో వేయడం |
వగరు |
||||
5 |
ఉప్పు |
గట్టిగా ఉంటుంది |
నలిపి చూడడం |
కర్పూరం కంటే గట్టి |
వ్యతిరేకం |
||
కర్పూరం |
ఉప్పు కంటే కొంచెం మెత్తగా ఉంటుంది |
నలిపి చూడడం |
ఉప్పుకంటే మొత్తని |
||||
ప్రయోగ ఫలితం |
v ప్రయోగాలలో 3 తప్ప అన్నీ ఒకదాని కొకటి బిన్నమైన ఫలితాన్ని ఇచ్చాయి కాబట్టి ఉప్పు is not equal to కర్పూరం |
||||||
v దీన్ని అనుసరించి పురుషులందు పుణ్య పురుషులను పరీక్షించాలి. |
|||||||
ప్రయోగం |
పద+అర్థం |
ధర్మం/ రూపం/ స్వభావం/ గుణం/ అర్థం |
పరీక్షావిధానం |
వచ్చిన ఫలితస్థితి |
ప్రయోగం ఫలం సమానం/ వ్యతిరేకం |
||
1
|
పురుషులు |
మనుషులు(రూపం) |
పరిశీలించాము |
ఒకేలా ఉన్నారు |
అనుకూలం |
||
పుణ్య పురుషులు |
మనుషులు(రూపం) |
||||||
2
|
|
అర్థం పరంగా |
పుణ్య= ధర్మము;పవిత్రము, సుకృతం, అన్న అర్థాలున్నాయి పురుష= పౌరుషం కల |
స్త్రీ పురుషులు ఎవరైనా కావచ్చు. పై స్త్రీ అన్న పదానికి మళ్ళీ అర్థం తెలుసుకోవాలి |
వ్యతిరేకం |
||
స్త్రీ |
అర్థం పరంగా |
సహనం కల, ఓర్పు కల (గుణాలు కదా) |
|
|
|||
|
ఇక్కడ ఒక నిర్ణయానికి రావాలి . గుణం పరంగా స్త్రీలు అందరూ స్త్రీలు కారు. అలాగే మగవారికి ఇవి వర్తిస్తాయి. పురుషులు->1వరకం=పురుషగుణం+పురుషరూపంకల పురుషులు. 2వ రకం= స్త్రీ గుణం + పురుష రూపం కల పురుషులు =స్త్రీ-> 1వ రకం = స్త్రీ గుణం+ స్త్రీ రూపం కలవారు. 2వ రకం = పురుష గుణం+ స్త్రీ రూపం కలవారు. కుండలీకరణ(matching) చేస్తే పు. 1vs స్త్రీ 1-> ఫార్ములా 1= భారత దేశంలో ఉత్తమ కుటుంబం(male domination) పు.1 vs స్త్రీ 2-> ఫార్ములా 2= తగువులు ఎక్కువ(విడాకులకు దారి, లేదా misunderstand) పు.2 vs స్త్రీ 1-> ఫార్ములా 3= female domination పు.2 vs స్త్రీ 2-> ఫార్ములా 4= non-decision family |
||||||
3
|
పురుషులు |
వ్యాకరణ పరంగా |
పురుషులు బహువచనం, పుణ్యపురుషులు బహువచనం. వేరు వేరుగా కనిపిస్తారు. ఎప్పుడు? నువ్వు కనుక్కున్నప్పుడు. పుణ్య పురుషుడు అనకుండా పురుషులు అని బహువచనం వాడడం వల్ల పురుషత్వం కలవారు అని స్త్రీలను కూడా సూచించడం దీని ప్రయోజనం. పుణ్య పురుషులు ఉన్నారు వారిని గమనించి ఆ విధంగా ప్రవర్తించమని సూచన. |
ఒకేలా ఉన్నారు |
వ్యతిరేకం |
||
4 |
|
సాహిత్య పరంగా |
“చెల్లియుండియు సైరణ సేయువతఁడుఁ, బేదవడియును నర్థికిఁ బ్రియముతోడఁ దనకుఁ గల భంగి నిచ్చు నతండుఁ, బుణ్య పురుషు లని చెప్పి రార్యులు కురువరేణ్య!” (శ్రీమదాంధ్ర మహాభారతం, ఉద్యోగపర్వము – ద్వితీయాశ్వాసము. 42) తనకు అపకారం చేసిన వానిని దండించగల శక్తి తనకున్నప్పటికీ, ఆ శత్రువును దండనకు గురిచేయక క్షమించి వదలిపెట్టేవాడు, తాను పేదరికంలో జీవితాన్ని వెళ్ళదీస్తున్నప్పటికీ, తనను యాచించిన వానికి, లేదు పొమ్మనక, తనకున్నంతలో ప్రియంగా పెట్టేవాడు, పుణ్య పురుషులని పెద్దలు చెబుతారు. క్షమాగుణాన్ని చేతగాని గుణంగా భావిస్తారు కాని దానికి మించిన ధర్మం లేదు. లోకంలో సత్యానికి మించిన మంచి గుణం లేదు. |
|
వ్యతిరేకం |
||
5 |
|
లోకంలో ఉన్న పుణ్యస్త్రీ, పుణ్య పురుషుడు పరిశీలన |
పుణ్యస్త్రీ వాడుక భాషలో పునిస్త్రీ అంటారు. అంటే భర్త బతికి ఉండగా ఆమె తనువు చాలించింది. అంటే భర్తకు సేవలు చేస్తూనే తరించి, బంధనాలనుంచి ముక్తి పొందింది. ఈ నేపథ్యంలో చూడాల్సి వస్తే పుణ్య పురుషుడు అంటే భార్య ఉంటుండగానే అతడు చనిపోవడం. కానీ లోకంలో ఇలాంటి వ్యవహారం లేదు. |
|
వ్యతిరేకం |
||
6 |
|
వేదాంత ధోరణి |
ఒక వ్యక్తి భక్తి భావనకు తార్కిక(లాజిక్)దృష్టిని జత చేస్తే అది వేదాంత దృక్పథం అవుతుంది. ఉన్నంతలో దానం చేయటం మహా పుణ్యప్రదం. ‘ఒరులకు పెట్టి తాననుభవించటం’ మన జీవన సూత్రం కావాలి. ఎదుటివాని ఆకలిబాధనో, మరే ఇతర కష్టాన్నో అర్థం చేసుకొని సహకరించటం మంచిమనసు కలవారికే చెల్లుతుంది. అదే సార్థకమైన జీవితం. వేమన నాస్తికుడు అనే మాటతో చాలమంది భావిస్తారు. వివేకానంద నాస్తికుడు అన్న మాటకు “తనను తాను నమ్మని వాడు” అని చెప్పాడు. ఈ అంశాన్ని స్థూలంగా ప్రతివారూ జీవితంలో అన్వయం చేసుకోవాలి. పురుషత్వం త్యాగంతోనూ, ఎదుటివారి కష్టాలను చూసి ఆర్ధ్రత కలిగినప్పుడు వారిలో ఇలాంటి స్థితి కలగవచ్చు |
|
వ్యతిరేకం |
||
v 1వ ప్రయోగం తప్ప మొత్తం ప్రయోగాల ఫలితం వ్యతిరేకం. ఉప్పు, కర్పూరానికి అన్వయిస్తూ పరిశీస్తే ఉప్పు సాధారణ పురుషత్వం. కర్పూరానిది తనను తాను కోల్పోయినా మంటలో వేసినప్పుడు కాసేపైనా నిప్పుకు చల్లదనాన్ని ఇచ్చానన్న అభిమతం, అలాగే పుణ్య పురుషత్వానిదీనూ. పురుషుడి వల్ల ప్రయోజనాలు ఎక్కువగానే ఉండొచ్చు. కానీ పుణ్యపురుషుడు లోకాన్ని పది కాలలపాటు ఆనందంగా ఉంచాలని, దానికి తగిన విధంగా వారి నడవడిక ఉంటుందని దీని నిగూఢ అర్థం. |
|||||||
No comments:
Post a Comment