Tuesday, May 30, 2023

ఐక్యతా శక్తిని చాటుదాం కరోనాను తరుముదాం

 

- డా. జాడ సీతాపతి రావు, సహాయకాచార్యులు,

రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయ౦,

నూజివీడు ప్రాంగణం, కృష్ణా జిల్లా- 521202.

విద్యుల్లేఖ: seethuphd@gmail.com

సంచారవాణి: 9951171299.

 

 

వైద్యుల, పరిశుద్ధ్య కార్మికుల సేవల్ని రెట్టింపు చేశావు/

రక్షణభటుల్ని రాత్రికూడా నిద్రపోనీకుండా చేస్తున్నావు/

కరోనా, నిన్ను చూస్తుంటే చక్కటి అందమైన బంతికి/

రంగుల బంతిపూలు గుచ్చి పైన పుప్పొడి పెట్టినట్లున్నావు./ 

 

వేడినీళ్లు గొంతులో పోసి గురగుర మనమంటారు/

మందుబిళ్ళ తింటే చాలు, అరటిపండు ఇలా ఎన్నో/

ఎక్కడపడితే అక్కడ ఉమ్మకుండా చేశావ్, ముక్కులకు/

చెత్త పోకుండా రక్షణ కవచాల్ని పెట్టేలా మలిచావ్/

 

నిరంతరం ప్రచార మాధ్యమాలు నీ నామ జపాన్నే చేస్తున్నాయ్/

ప్రజల్లో చైతన్యంపెంచుతున్నా నిర్లక్ష్యం దాన్ని అంతం చేస్తుంది.../

ఇటలీ, ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్ దేశాలు ఏవైనా నీ దెబ్బ సింగమే/

రాక్షస వంశమే నువ్వు, శుభ్రతను వదిలితే అంతానికి చెల్లుచీటీ  /

 

విద్యుత్ లాంటి వేగం ముట్టుకుంటే హత్తుకునే వైనం/

దిక్కులు పిక్కటిల్లే ధైర్యం, కడుక్కుంటే వదిలే నైజం/

ఇంటిపనులు చూసేదృష్టి, పిల్లలతో తినే మృష్టాన్నం /

జాగ్రత్తగా ఉంటే నువ్వే స్వర్గం, అజాగ్రత్త మృత్యువు /

 

ఇల్లే కరోనానుంచి లోకాన్ని కాపాడే భీమశంకరం/

శుద్ధతే కరోనానుంచి మనల్ని కాపాడే అభయంకం/

శ్రీరామరక్ష స్వీయ నిర్బంధమే, ఇల్లే కార్యాలయం /

 మమతల గుడిలో సమతల సంగీతాలే రక్షాలయం/

 

కరోనా నువ్వు ఆత్మావలోకనానివి/

మృత్యువును దృశ్యీకరించే అందానివి/

రామాయణంలో తపస్సు చేసిన కర్కటివి/

బ్రహ్మ వరానివి, బ్రహ్మాండానికి తెలిసావు/

 

మోడీగారి ఆదివార దీపజ్జ్వలనం దీపావళిని స్ఫురిస్తుంది/

అందమైన వెన్నెల్లో దివ్యమైన జ్ఞానం పొందిన మునిలా/

మత కులాతీత మాలిన్యాన్ని వదిలిన చైతన్యంలా/

ఐక్యతా శక్తిని చాటుదాం కరోనాను తరుముదాం/

No comments: