-డా. జాడ సీతాపతి రావు, సహాయకాచార్యులు,
రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం,
నూజివీడు ప్రాంగణం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
విద్యుల్లేఖ: seethuphd@gmail.com
సంచారవాణి: 9951171299
యు. పి. యస్.సీ సివిల్స్
మెయిన్స్ లో ఐచ్ఛిక అంశంలో తెలుగు లో రాసేటపుడు కాలాన్ని తగ్గించేలా రాసేవిధానం.
సంక్షిప్త రచన విధానం- వేగ౦గా రాసే పద్ధతిలో సమాధానాలకు సహకారి. ఈ క్రింది రకంగా రాసినపుడు సమయం ఆదా అవుతుంది. వ్యవహారిక భాషకూడా. కొన్ని ఉదా. కు చూడండి. సాధన చేయండి. విజయోస్తు...
క్ర. సంఖ్య |
పెద్ద పదం |
సంక్షిప్త పదం/ వివరణ |
1 |
ఉదాహరణకు |
ఉదా: / మచ్చుకు |
2 |
చేయుచున్నాడు |
చేస్తున్నాడు |
3 |
ము ఉన్న చోట్ల ౦ ని రాయడం |
రామాయణము- రామాయణం; భాగవతము- భాగవతం మొ. |
4 |
మొదలైనవి, సంవత్సరములో. |
మొ.వి./ ఇత్యాది; సం.లో |
5 |
గ్రహించబడింది |
గ్రహించారు |
6 |
తీసుకొనబడింది |
తీసుకున్నారు. |
7 |
మరియు, యొక్క, బడు లాంటివి వాడకుండా ఉంటే మంచింది. |
మరియు బదులు కామా(,) వాడాలి. |
8 |
పద్యం కోడ్ చేయాల్సినపుడు |
మొదటి రెండు మూడు పదాలు; చివరి రెండు మూడు పదాలు మధ్యలో ..... చుక్కలు పెట్టి రాయాలి. వివరణ వాక్యాల్లో ఇవ్వాలి |
9 |
Repeat గా వచ్చే పదాల సందర్భంలో |
చివరిలో ఒకసారే ఆ రిపీట్ అయిన పదాన్ని ఉంచి మిగతా చోట్ల తీసేస్తే అర్థంలో మార్పు లేనపుడు తీసేయాలి. |
10 |
పాయింట్ లలో రాసేటపుడు |
సాధ్యమైనంత తక్కువ క్రియా పదాల్ని వాడాలి. రిపీట్ లేకుండా చూసుకుంటే మంచిది. పరిశోధన విధానమైన 1.1; 1.2; 1.3; లా రాయాలి. |
11 |
భేదాలు, సామ్యాలు రాసే సందర్భంలో |
పైన శీర్షిక ఉంటుంది. కాబట్టి మళ్ళీ రిపీట్ చేయరాదు. |
12 |
వరుస సంఖ్యలు రాసే సందర్భంలో |
క్రీశ 1500 నుంచి/ నుండి 1600 వరకు అనే చోట 1500-1600 అని రాయడం మంచిది. |
13 |
గ్రాంధిక భాషా సందర్భంలో |
ఉదాహరణలు ఇచ్చే సందర్భంలో తప్ప, మిగిలిన చోట వ్యవహారిక లేదా మాట్లాడేలా భాషను వాడాలి. |
14 |
ఒకే సమాచారం ఉన్న సందర్భంలో |
దాన్ని ఒక ఉపశీర్షిక(sub- heading) లోకి తెచ్చి రాయాలి. |
15 |
కొటేషన్స్ వాడే చోట |
పూర్తిగా ఆ అంశాన్ని యథాతథంగా తీసుకుంటే డబల్ కొటేషన్("...") లో రాయాలి. దానివల్ల సమయం వృధా అవుతుంది అనుకుంటే దాన్ని సింగిల్ కొటేషన్('...') లో పెట్టి ఆ భావాన్ని రాయాలి. |
16 |
ఒకే నామ వాచకం పునరుక్తి అవుతున్న చోట |
సాధ్యమైనంత వరకు మొదట ఆ నామ వాచకం వాడి, మిగతా చోట్ల సర్వనామాలు వాడాలి. |
17 |
టేబుల్ ఫామెట్ రాసేటపుడు |
రెండు/ ఇద్దరికీ ఉన్న అంశాలను ఒకే సీరియల్ నెంబర్ లో తెల్పాలి. మొదట క్రియాపద౦ వాడితే రెండో చోట అవసరం లేకపోతే మానేయాలి. |
18 |
ఒకే పదాన్ని రాయాల్సినపుడు |
దాని పర్యాయ పదాలలో చిన్ని పదాలను ఎంపిక చేసుకోవడం మంచిది. |
19 |
వంటి, కావున, అందుచేత, మరి, లాంటి పదాలు ఊత పదాలు |
సాధ్యమైనంత తక్కువ వాడితే మంచిది. వీటిని కొన్ని సార్లు వాక్యాల్ని కలపడానికి వాడొచ్చు. |
20 |
పదాలు తప్పొప్పులు ఎలా తెలుస్తాయి. |
ఏ తప్పు వస్తుందో ప్రాక్టీస్ టెస్ట్ లలో తెలుసుకొని ఇంపోజిషన్ 10 సార్లు రాసి సరిచేసుకోవాలి. ఉదా: భేదం (ధ వత్తు పెట్టినా, భ కి వత్తు తీసేసినా తప్పే) |
21 |
జరుగుతుంది. జరుగుతాయి. జరుగుద్ది, జరగ బట్టి ఇలాంటివి జరుగుడు వాక్యాలు |
వీటిని సాధ్యమైనంత తగ్గించాలి. లేకుండా రాయాలి. |
22. |
మాండలిక భాషలో రాయొచ్చా? |
సాధ్యమైనంత శిష్ట వ్యవహారికాన్ని వాడాలి. కేవలం మండలికం చెప్పెటపుడు మాండలిక పదాలు వాడాలి. |
23 |
ఆంగ్ల పదాలు వాడొచ్చా? |
ఒకవేళ మీకు ఆంగ్ల పదానికి తెలుగు పదం గుర్తుకు రాకపోతే దాని స్క్రిప్ట్ తెలుగు ఉచ్ఛారణ లోకి మార్చి రాయడం మంచిది. |
24 |
సంభాషణలు రాసేటపుడు |
మొదటిలో వ్యక్తి పేర్లు రాసి తర్వాత అతడు ఆమె అని రాయాలి. |
25 |
ప్రభావములు, వినోదములు మొ. చోట్ల |
ప్రభావాలు, వినోదాలు (ము లేకుండా దీర్ఘం వల్ల అదే అర్థం వస్తుంది) మొ. పదాలు వాడుకోవాలి. |
26 |
వున్నాయి, వున్న లాంటి వు కారంత పదాల్ని రాయాల్సి వస్తే |
తెలుగులో పదం మొదట వు, వూ, వో, వో లు లేవు. అలాంటి చోట అచ్చు ఉ రాయడం. |
27 |
ప్రధానమైనది |
ప్రధానమైంది |
28 |
అవుతుంది. |
ఔతుంది. అవు స్థానంలో ఔ, అయిన స్థానంలో ఐ వాడడం వల్ల అక్షరాలు తగ్గుతాయి. అర్థంలో తేడా లేదు. |
29 |
పడవలసి |
పడాల్సి |
30 |
ఉన్నాయి, సాగుతుంటాయి, ఉంటాయి లాంటివి |
ఉన్నై, సాగుతుంటై. ఉంటై.. |
31 |
ఉండవచ్చు |
ఉండొచ్చు |
No comments:
Post a Comment