Tuesday, March 17, 2020

కాలోపి దురతి క్రమణః

తరంగాల వరుసలో అంతరంగాలు లేని ప్రయాణం
శ్వాసలో  ధ్యాసలో ఏదో తెలియని నిశ్వాస, నిట్టూర్పులు
మనసు మందిరంలో బంధించిన ప్రేమ మొలక
ఎప్పుడు తన్నుకు వచ్చిందో తెలియక ఆందోళన

గుండె నిండా గాలిపీల్చుకుని వదలడం రాని యోగిని
ముసిముసి నవ్వులు నవ్వలేని యవ్వనిని
పారాడ లేని బాల్యం లేని అందంగా లేని బాలుడిని
ఎండకు వానకు ఎండని తడవని తాపసిని

స్థిత ప్రజ్ఞత, ముందు చూపు లేని కాల నిర్ణయ పట్టికను
ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని ప్రాణాన్ని
నేనంటే అందరూ భయపడతారు బద్ధకస్థుడు తప్ప
ఇంతకీ నేనెవరిని? సంస్కృత భారతంలో చెప్పని నాయకుణ్ణి .

No comments: