Tuesday, May 30, 2023

నా చీపురు

 

డా. జాడ సీతాపతి రావు, సహాయకాచార్యులు

రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం, నూజీవీడు,

                                                                        కృష్ణాజిల్లా- 521202. చరవాణి: 9951171299

 

 

రహదార్లకు రమ్యతనిస్తూ,  అది లేని జీవితాన్ని నేను

నేను లేకపోతే పాపం దురదగొండి రాసిన వారుగా

మారిపోతారు పట్నాల దేవుళ్ళు, బజార్లు బెంబేలెత్తి పోతాయ్

కానీ నేను మాత్రమే అరగంజి తాగే నిత్య సంతోషిని...

 

అరె ఒరే అనే పిలిచే నాలుకలు, చీదరంగా చూసే చూపులు  

నా మొహాన్నీ,  నా వెన్నునీ ఎప్పుడూ తాకుతూనే ఉంటాయ్....

నా చెమట, రైతన్నకు డబ్బులిస్తారని పట్నాలను సేవిస్తా

నా మొహాన  గుడ్డలా, ఆ పాపమే  కరోనా వీళ్ళందరినీ చేసింది

 

ఎక్కడో కొబ్బరి చెట్టు మీదో, కొండమీదో, ఊరవతల

ఏటి గట్టో నా చీపురు జన్మస్థానం, ఇప్పుడూ నేనూ ఉరవతలే

నేను వాస్తవ వాదిని, నా బతుకు ఎప్పుదూ రహదారి మీదే

నేనే చీపురు చీపురే నేను మా ఇద్దరి బంధం శబ్ద వాక్ బంధం

 

నేనెప్పుడూ విమర్శించని కవిని, నాలోకం నా సేవే నాది

ఏసు, అల్లా, థెరిస్సా వీళ్ళ పేర్లు తెలియని పని రాక్షసుణ్ణి.

తెలిసింది ఒక్కటే రోడ్డును నా శక్తితో నాకి, పస్తులుండడమే

మీరు నమ్మరు,  ఇప్పుడు నిజంగా నవ్వొచ్చి, జాలేస్తుంది-

 

కరోనా అట, నన్ను కాదని మీ దగ్గరికి వస్తుందట,

నన్ను దేవుణ్ణి అంటుంటే నా సేవను గుర్తిస్తుంటే

బండబారిని బతుకును మెచ్చుకుంటూ ఉంటే

కరోనా కబద్డార్... అంటూ ఆనంద భాష్పాలు నాలో

 

తెల్ల దొరల్లా మెరిసే వైద్యులు మాకూ జాగ్రత్తలు చెబుతున్నార్

ఖాఖీ మామయ్యలు మమ్మల్ని ఏమీ అనడం లేదు, రైతన్న మాత్రం

నాలా తన పనిలో లీనవమవుతూనే ఉన్నాడు...అందరి ఆకలి కోసం

కరోనా భయస్తుల్లారా!  మమ్మల్ని చిరునవ్వులతో చూడండి

 

ఇంట్లో మా సోదరీ మణులు, ఇంటి సామ్రాజ్యానికి మహారాణులు

పప్పన్నం పెట్టినా, పచ్చడి మెతుకులు పెట్టినా, మీ ప్రాణాలకు

వారి ప్రాణాలు అడ్డం వేస్తారు, మా చెమటతో రుచినిచ్చే ఉపకారులే

ఢిల్లీలో చీపురే ప్రభుత్వం... అయినా ఎప్పుడూ నిరాడంబరతే మా నీతి

 

చీపురుకూ ఒకరోజు వస్తుంది, మా పేదల పేరుమీద పల్లె “చీపురుపల్లి”

ఎవరిమీద చీదరించుకొకు, కరోనాకు కోపం వచ్చి నీ మీద పడుతుంది

చీపురును పట్టుకున్నా ఆ చేత్తో ఎవరినీ ముట్టకు, దాన్ని గౌరవంతో కడుక్కో

చీపురుది మూలనిర్బంధం అని భావించకు, అది రోడ్డెక్కింది నువ్వు రాకు

 

పొరుగుసేవల్లో పని చేసే ఊర పిచ్చుకను నేను

నా దినమొక చీపురు కట్ట మొహంతోనే ప్రారంభం

ఎంతో ఓపికగా నేలను నాకీ, నాలానే నా చీపురూనూ

నా చేతులు ఆరోగ్య శాస్త్రాల్ని తిరగరాసే మరో ధన్వంతరీలు

       

No comments: