Tuesday, May 30, 2023

భౌతికంగా దూరంగా ఉన్నా అంతరంగంలో ఐక్యం

 

డా. జాడ సీతాపతి రావు, సహాయకాచార్యులు

రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం, నూజీవీడు,

                                                                        కృష్ణాజిల్లా- 521202. చరవాణి: 9951171299

 

 

కరోనా నువ్వు అంతరంగంలో సంస్కారం నేర్పిన సూక్ష్మజీవివే కావచ్చు

మద్యం దుకాణాల్ని, అనవసర టెంన్షలను దరిచేరనీయని  కొత్తదానివి

అయినా మా పూర్వీకులు ఎప్పుడో నీ గురించి సూచిస్తూనే ఉన్నారు

మనిషి శవాన్ని సంస్కారం చేసిన వారికి పన్నెండు రోజులు క్వారంటైన్ లో ఉంచారు

 

షేక్ హ్యాండ్ సంస్కృతికి మించిన నమస్కారాల్ని నేర్పారు

ఆటలమ్మలు వచ్చిన మా ఇళ్ళల్లో క్వారంటైన్ లో ఉండాల్సిందే

ఆవకాయ, దబ్బకాయ లాంటి ఊరగాయలు మా ఇండ్లలో కూరలు

చల్ది అన్నాలు, చల్ల మిరపకాయలు, కంది పొడులు మా వంటింటి దైవాలు

 

కాలినడక ఉదయపు వ్యాహ్యాళి, తరవాణి పిల్లలకు అమృత భాండం

తెలగ పిండి, గుమ్మడి వడియాలు, ఉలవచారు, రాగి సంకటి ఇలా ఎన్నో..

హృదయపు రహదారులే మాకు అంతరుఖత్వం, స్థిత ప్రజ్ఞత్వం

వేసవిలో ఉగాది పచ్చడి, అప్పుడే పండుతున్న మామిడి మా నిత్య నైవేద్యాలు

 

కందికట్టు, ఉలవచారు, మజ్జిగ పులుసు...  వంటింటికి మా అమ్మే ఆయుర్వేదం

ఇంట్లోకి ఎవరు రావాలన్నా కాళ్ళు, చేతులు ముఖం కడుక్కోవడమే మా సంస్కృతి

ఉదయ, సాయంత్రాలు సాంబ్రాణితో మా ఇళ్లే ఒక దేవాలయం గా మారుతుంది

పసుపు ద్వారాలు, ఇంటి ముందటి తులసి చెట్లు మా ఇంటికి దేవతలు

 

వేపపుల్ల దంత ధావనం, గంజి త్రాగడం, రాగిజావ ఉల్లిపాయ,

పట్టిడి మంచాలు, బొంతలు వాడకం, అగరు బత్తి, హారతి కర్పూరం

 వదులైన దుస్తులు ఇవన్నీ మా ఆరోగ్య రక్షలు

మాట్లాడే తప్పుడు చేతిని అడ్డం పెట్టుకోడం మా అలవాటు

 

తన వలే ఇతరుల్ని ప్రేమించడం, సంస్కారం నేర్పడం మా ధర్మం

రామాయణాలు, భారతాలు, భగవద్గీత మా ధర్మాన్ని నిలిపే చేతలు

అన్నా,  అక్కా, చెల్లి, బావ, మేనమామ....  మా బతుకుకోరు బంధుగణాలు

కులాలు మా వృత్తులు, మంచితనం మా మానవత్వం సనాతనత్వం

 

కరోనానైనా కర్కటైనా భౌతిక దూరం పాటిస్తూనే ఐక్యత మా ఆదర్శం

కష్టం వస్తే కన్నీరు కారుస్తున్న వారికి పరామర్శతో ఓదార్పునౌతామ్

మేమంతా నీ వెంటే ఉన్నామని చావు ఇండ్లలో సైతం నిలుస్తాం

భౌతికంగా దూరంగా ఉన్నా ఎప్పుడూ ప్రకృతి ప్రేమికులమే

 

  

 

 

No comments: