ప్రధానము
= 1. పరమాత్మ, 2. ప్రకృతి, 3. బుద్ధి, 4.
ముఖ్యము
ప్రధనము=
1. యుద్ధం, 2. చీల్చుట.
ప్రథమము=
1. మొదటిది, 2. ముఖ్యం.
ప్రథితి/
ప్రథ = ప్రఖ్యాతి, పేరు
పథము=
మార్గం,
త్రోవ
పథ్యము=
హితం
దృక్+
పథము= దృక్పథము. దృక్= కన్ను, చూపు, బుద్ధి,
చూచువాడు
దృఢము=
అత్యంతం, (విణ) 1. అధికం, 2. దిటవుకలది, 3. గట్టిది, 4. బలిసినది{దృఢంగా
ఆహారం తింటే దిటవుగా తయారవుతావు}
దృతము=
సం.వి. ఆదరింపబడినది.
ద్రుతము=
సం.క్రి. విణ. 1. త్వరితం, వడిగలది, 2. కరిగినది, 3. చీలినది
దృతి=
తిత్తి,
భస్త్ర
ద్రుమము
= 1. వృక్షము, పారిజాత వృక్షం. (డు)1. కింపురుషుడు, 2. శిశుపాలుడి
స్నేహితుడు
గృహస్థుడు=
భార్యను పరిగ్రహించి, ధర్మార్థ కామములను నడుపుతూ వేద పాఠము, వైశ్వదేవాది
హోమము, అతిథి పూజ, పితృతర్పణం, భూతబలి, అన్న ఐదు యజ్ఞాల్ని చేస్తూ ప్రవర్తించేవాడు; ఇలుఱేడు.
పదకము
= క్రమం, పతకము
పటిష్టము=
మిక్కిలి పటువైంది.
ప్రతిష్ఠ=
గౌరవం;
చోటు; శాశ్వతంగా నిలుపుట; నెల, నావగవ ఛందస్సు.
ప్రతిష్ఠించు
= శాశ్వతంగా నిలుపు
యథేచ్ఛ
= ఇచ్చవచ్చినట్లు
యథార్థం=
సత్యం
యథాక్రమం=
క్రమాన్ని అతిక్రమించక
యాదాస్తు=
(హిం.వి) ఆజ్ఞాపూర్వకమైన ఉత్తరం
యాదృశం=
ఎటువంటిది
యామి=
కులస్త్రీ, తోడ పుట్టినది
యమి=
ముని;
హంస
యుగ్యము=
గజాదివాహనము, (పుం) –కాడి మోసే యెద్దు
యుగ్మము=
జత,
యుగళం
యుతం=
కూడుకొన్నది; లెక్క; కలియకూడింది; వేఱు
పడ్డది
యతనము=
యత్నం,
జతనము
మేధావి=
చిలుక;
(విణ) మేధకలవాడు
మేదావి=
ఔపాసనాగ్నిమసి
మేధ=
ధారణాశక్తి గల బుద్ధి; యజ్ఞం
మేదించు=
మర్దించు
మేదిని=
భూమి
మేదురము=
చక్కనైనునుపైనది
పదరు=
త్వరపడు; కోపించు, చలించు; (క్రి)
ఆక్షేపించు, (ఆ.వి.బ)త్వరితపు మాట
పదురు=
త్వరపడు; (వి) విధం, అధికారం, త్వరితపు
మాట
ఱంకె
= (దే.వి)ఋషభధ్వని; ధ్వని, కేక
ఱంకెత=
(ద్వ.విణ)(ఱంకు+ ఎత) జారిణి
ఱంపము=
(దే.వి) (ఱంపము+కాడు) = కోయువాడు, ఱంపగాడు, పలకలు లోనగునవి కోసెడు సాధనం, క్రకచము
ఱవ్వ=
దూఱు,
నింద
రవము=
ధ్వని,
కంఠ ధ్వని
రవ=
వై.వి = అణువు, (పుప్పొడి రవ్వ); ఖండం; వజ్రం; రవగాలు; (విణ) సన్న
రచ్చ=
రాజమార్గం; మండపం; సభ; గోష్ఠి; కలకము; కలహము
వరబడి=
(దే.వి) కఱవు
వరవుడు=
దాసి
వఱద=
దే.వి) వెల్లువ, ప్రవాహం
వరదుడు=
వరాన్ని ఇచ్చేవాడు
1 comment:
బాగుంది.
ఈ పదాలను అందరూ ఒకసారి పరిశీలించండి.
ఇంగ్లీషులో Q ఎందుకూ అనవసరం అని మనకు ఎప్పుడూ అనిపింఛదు కాని తెలుగులో ఋ ఎందుకూ ఱ ఎందుకూ లాంటీ అమూలూమైన సందేహాలు వచ్చేస్తూ ఉంటాయి.
భాషనీ దాని ఔన్నత్యాన్నీ గౌరవించటం ఇప్పటినుండైనా తెలుగువాళ్ళం మొదలు పెట్టాలి.
శుభం.
Post a Comment