ఓ! ఆంగ్ల నామ సంవత్సరమా, ఆహ్వానం
ఓ! ఆంగ్ల నామ సంవత్సరమా, ఆహ్వానం
చల్లని మరుత్తు వెచ్చని కౌగిలికి
సిగ్గుముగ్గు కుర్రకారుకీ
నువ్వేం చేస్తావో తెలీదు కాని
నువ్వు వస్తావంటే ఏదో మత్తు మాకు
గ్రీటింగుల పండగ మొదలైనట్లే
స్కూలు పిల్లల నుంచీ విశ్వవిద్యాలయానికి
నీవంటే ఎంచో ముచ్చటా, అచ్చటానూ
ఎంతో మందిని కలుపుతావు
ఎంతో మందిని విడదీస్తావు
ఏమిటో అంతుపట్టని విలాసం
నీవుకిక్కెక్కిన కుర్రకారుని చూస్తే
మత్తెక్కిని తుమ్మెదవవుతావు
వారి మత్తు శాశ్వతం కాకూడదని
కళ్ళు తెరచి ఆనందం పొందాలని చూస్తావు
మంచినిచ్చే ఆనందమా
నీ కివే నా ఆహ్వానం
నీ రాకకై క్రిస్మస్ వస్తోంది
భవిత బంగారం కావాలని..
నీకై, శ్రమిస్తూనే
ఎదురు చూస్తా..
నా బ్లాగు దర్శించినందుకు ధన్యవాదాలు .. ఈ బ్లాగులోని రచనలన్నీ నా స్వంతం. చదవండి, ఆనందించండి. బాగుంటే మీ కామేంట్ రాసి పోస్టు చేయండి ధన్యవాదాలు. మిస్ యూజ్ చేయకండి.
Thursday, December 20, 2007
Tuesday, December 18, 2007
మధ్య -- మంద హాసం
మధ్య తరగతి మంద హాసం
మబ్బువీడని మతం కులం
పురోహితుడిగా చెలామణీ
జేబులో లేని కాణీ
పేరుకు అగ్రవర్ణం
బతుకులేని జీవనం
వృత్తులు మారిన మతాలు మారినా
నుదుటిపై నెత్తుటి గీత మతం కులం
ఎన్నాళ్ళీ జాడ్యం? ఎన్నేళ్ళీ కులం?
తరాలు మారాయి దినాలు మారాయి
నేటి దినం తీర్చే దెవరు?
సంకరం సంగమం ఉన్నా
ఏ కులమని నీ బోడి ప్రశ్న
ఊర్లలో మొదలై విశ్వ విద్యాలయాలకు
ఓట్లతో మొదలై రాజకీయలకు చేరినై
దేవుళ్ళకు ప్రాకినై ఇంకా ఎన్నెళ్ళు?
కులం పేరుతో మారణ హోమం
సిగ్గు లేదా మనిషివని చెప్పడానికి
నీకు తెల్సు దాన్ని ఎలా ఉపయోగించాలో
కుతంత్రాలు మాని మనుగడ చెయ్
కలకాలం కుళ్ళులేని మనిషిగా
మానవత్వంతో మరో అదర్శం నీవవ్వు
మబ్బువీడని మతం కులం
పురోహితుడిగా చెలామణీ
జేబులో లేని కాణీ
పేరుకు అగ్రవర్ణం
బతుకులేని జీవనం
వృత్తులు మారిన మతాలు మారినా
నుదుటిపై నెత్తుటి గీత మతం కులం
ఎన్నాళ్ళీ జాడ్యం? ఎన్నేళ్ళీ కులం?
తరాలు మారాయి దినాలు మారాయి
నేటి దినం తీర్చే దెవరు?
సంకరం సంగమం ఉన్నా
ఏ కులమని నీ బోడి ప్రశ్న
ఊర్లలో మొదలై విశ్వ విద్యాలయాలకు
ఓట్లతో మొదలై రాజకీయలకు చేరినై
దేవుళ్ళకు ప్రాకినై ఇంకా ఎన్నెళ్ళు?
కులం పేరుతో మారణ హోమం
సిగ్గు లేదా మనిషివని చెప్పడానికి
నీకు తెల్సు దాన్ని ఎలా ఉపయోగించాలో
కుతంత్రాలు మాని మనుగడ చెయ్
కలకాలం కుళ్ళులేని మనిషిగా
మానవత్వంతో మరో అదర్శం నీవవ్వు
Tuesday, December 11, 2007
అందాలకు....మెరుపు
అందాలకు కొసమెరుపెప్పుడు
సంసారానికి జీవం ఎప్పుడు
మధ్యతరగతి అంథహాసం
మబ్బు వీడని సూర్యకాంతి
నింగినంటిన మెరుపు ధరలు
కల్లలైన జీవితపు పగటి కలలు
నరుని మనసు నాట్యమాడితే
ఇంటిలోన ఈగల మోత
కడుపులోన ఈగలమోత
అందమని పేరే ఓ నటన
మట్టి కలిపిన మనిషి చూడు
దిక్కులేని తెలివి చూడు
మనిషినంటిన కలిమిచూడు
కుళ్ళుచాటున కులముచూడు
మెరుపునున్న కాంతి కావాలా
దగ్గరున్న మంచి వదలి
లేని దగ్గులు మానుమింక
భూమినుండి బతుకుతెరవు
చూడుమింక
ఒట్టి మెరుపుల గొప్పలేల
బతుకివ్వని తిండి ఏల
నీతిలేని కలిమి ఏల
కలకాలం కుళ్ళుతో
కోట్లుండినా చావు ఏల
ఏదినిజం ఏది శాశ్వతం...
అందాలకు కొసమెరుపెప్పుడు
సంసారానికి జీవం ఎప్పుడు
మధ్యతరగతి అంథహాసం
మబ్బు వీడని సూర్యకాంతి
నింగినంటిన మెరుపు ధరలు
కల్లలైన జీవితపు పగటి కలలు
నరుని మనసు నాట్యమాడితే
ఇంటిలోన ఈగల మోత
కడుపులోన ఈగలమోత
అందమని పేరే ఓ నటన
మట్టి కలిపిన మనిషి చూడు
దిక్కులేని తెలివి చూడు
మనిషినంటిన కలిమిచూడు
కుళ్ళుచాటున కులముచూడు
మెరుపునున్న కాంతి కావాలా
దగ్గరున్న మంచి వదలి
లేని దగ్గులు మానుమింక
భూమినుండి బతుకుతెరవు
చూడుమింక
ఒట్టి మెరుపుల గొప్పలేల
బతుకివ్వని తిండి ఏల
నీతిలేని కలిమి ఏల
కలకాలం కుళ్ళుతో
కోట్లుండినా చావు ఏల
ఏదినిజం ఏది శాశ్వతం...
Friday, December 7, 2007
తాకాలనిపించే తాండ్ర
తాకాలనిపించే తాండ్ర
నేటి తేనీటి విందులు......
ముత్యంలాంటి చెలి
బుగ్గమీద కాసింది ఓ కాయ
దానికి రసాభిరుచిలేని వాడు పెట్టిన పేరు
పొగరుకాయ
యవ్వనం ఓ పన్నీటి పరిమళం
సొగసు ఓ ముఖమల్ క్లాతు
నువ్వనుకొనే కొవ్వు కాదు
కంపూటర్ల నెట్, గగనంలో సెట్
మరందాలు పూలందాలు పోయి
గగనసుమాలతో విరిసినదే ఈ కాయ
కుర్రకారు చేసినవే మత్తెక్కే పబ్బులు
క్యాట్ వాకింగులు,పరిగెడుతూ ఎక్కే బస్సులు
ఓ కవీ..! నీవు గమనించావో లేదో
అది అమ్మాయి మొటిం కాదు
తాకాలనిపించే తాండ్ర
ఆశపడే ఆనందం సుమా..!?
కావాలని వెంట పడే ముందు
ఉద్యోగం ఉందో లేదో చూడు
ధనం లేకపోతే దరువులే దరువులు
శ్రమ లేకపోతే కరువులే కరువులు
కరువు కాలంలో పండని శ్రమలే కాయే
వయస్సులో తుళ్ళింతల సొగసుల శోభ

నేటి సుఖం' బస్తీ '
నేటి సుఖం 'బస్తీ'
పాత దెంతో పదిలమనే పెద్దల
కొత్త దొక మోజుతో కుర్రల
తరాలు మారినా , మారని బతుకుకొత్త దొక మోజుతో కుర్రల
యుగాలు మారినా, మాయని ప్రేమ
మనిషి సృష్టించిన డబ్బుకు దాసోహం ప్రజ
మట్టి మారింది కాలుష్యంతో
మనసులు మారాయి జబ్బులతో, స్వార్థంతో
పిల్లతో కళకళ లాడే ఇల్లు టీ.వీ.ల రొదతో
ఉక్కిరిబిక్కిరై దిక్కితోచని దీనంగా నేడు
కళలు తెరలెక్కి కళ్ళు చెవులు తింటూ
నడిచే మనిషిని వాహనాలు నడవలేకుండా చేస్తూ
కష్టించే రైతును ట్రాక్టరు ఆక్రమించి
అభివృద్ధి పేరు, ఆత్మహత్యలు
మరణమా..! నీకూ చలించే గుణం,ధనంలా
నాటి గుగ్గిళ్ళూ పోయాయి,కష్టాలూ పోయాయి
నేడు మిగిలింది, బతకలేని చావు.
మరణమా..! నీకిదే శరణం
మమ్మల్ని మనుషులుగా బతకనీ
మాకు చెమట వాసన పడని
మూసి కంపుకు ముప్ఫై వేలరెట్లు
పున్నామ నరకమే ఈ బస్తీ సుమా..!?
Tuesday, December 4, 2007
వెనుక... ఏముంది!
ఏదైనా మంచి జరిగితే వెనుక ఉన్నది ఓ శక్తే..
మగాడి వెనుక ఆడది ఉంటే
ఆడదాని వెనుక మగాదు ఉండడా?
కారణం? అణగ ద్రొక్కే తనం?
కాదంటారా? అలా కాకపోతే ఆనందమే ...
మబ్బు చాటున దాచివేద్దామని
కాంతిని అబలగ చేయడం ఎంతవరకు?
మట్టికి,మనువుకి తేడాలేదా?
కష్టానికి ఇష్టంతో పనిలేదా?
ఆనందాన్నిచ్చే భార్య, అర్థం చేసుకొనే భర్త!
ఎన్ని పెళ్ళిళ్ళు జరిగాయి?ఎన్ని కన్నీళ్ళు ఒరిగాయి?
ఏ తరం బాగు కోసం సంపాదిస్తున్నారో!
ఉద్యోగాలపేరన కయ్యాల కాపురాలెన్నో?
ఫెషన్ పేరిట పట్టని నీతుల చదువుల నవతరం
కాని పనికి వస్తోంది నవతరం దోచుకోవడానికి
ఏ ఉద్యోగం వస్తుందో వెక్కోవడానికి
పదిజతల చెప్పులు ముప్ఫై యేళ్ళు
వెరశి జీవితం నాలుగు అక్షింతలు
రచ్చ బండలు మెచ్చని వియ్యాలు
కవిత్వం వినడం రాయడం కన్న
ఉన్నతస్థాయిని వెతుక్కోవడం మిన్న
ఇది నేటి తెలివైన వారి ఆలోచన
సంస్కారం అంటే
నమస్కారాల మస్కాలుగా నేటి యువతరం
వీటన్నిటి వెనుక ఉన్న బలియమైన శక్తి ..
పేదరికమా..? కులతత్త్వమా..?స్వార్థమా..?
ఏది..? నీ ఊహ వద్దు చూడు వాస్తవం..

రామలక్ష్మి-ద్రౌపది నవల- కొన్ని వివరణలు
నవల అనగానే కొత్త అంశం ఉంటుందనే భావన కలుగుతుంది. ద్రౌపదిని గురించి తెలియని తెలుగు వారుండరు. అలాంటప్పుడు ద్రౌపది గురించి చెప్పడాని కొత్తదనం ఏముంది? ఏముంటుంది? అనే ప్రశ్నలు పుడతాయి.
భారతంలో ఏదైనా ఒక పాత్ర గురించి పూర్వాపరాలు తెలుసుకోవాలి.అప్పుడే సరైన విషయావహగాహన వస్తుంది. ద్రౌపది గురించి తెలుసుకోవాలన్నప్పుడు మూలభారతంలో ఏముంది ప్రస్తుతం ఎలా ఉందో తెలుసుకోడం అవసరం. ఇంకో విషయం ఏమిటంటే భారతం పుట్టి చాలా సంత్సరాలు అయినా వ్యాసభారతం పూర్తిగా ఆధునిక లేక వ్యహరిక తెలుగులోకి రాకపోవడం శోచనీయం . నీలకంఠ మొదలైన వారి వ్యాఖ్యలు ఇప్పుడిప్పుడే శలాక రఘునాధ శర్మ గారు మొదలైన వారు వ్యాఖ్యలు రాయడం జరుగుతోంది.
భారతాన్ని చదవని పండితుడు లేడంటే అతిశయోక్తి కాదు. ఇక రామలక్ష్మి గారు మంచి భారతం పై పట్టు ఉన్నవారే (ఆరుద్రగారి సహధర్మ చారిణి). నవలను ప్రారంభించడం లో జాగ్రత్త వహించారు.ఇంచుమించు కధ అంతా తెలిసిందే అయినా ఒక కొత్త కోణం ఆవిష్కరించే ప్రయత్నం చేసారు. స్వర్గ లోకానికి ప్రయాణంతో కథ మొదలౌతుంది.
ముందుగా ద్రౌపది తూలి పడి పోతుంది. అది గమనించిన భీమడు ధర్మరాజుతో "అన్నా! ద్రౌపది ఎందుకిలా పడిపోయింది కారణం ఏమని" అడుగుతాడు. ఆమెకు అర్జునుడిమీద ఎక్కువ ప్రేమే కారణంగా సమాధానం చెప్తాడు. తర్వాత సహదేవుడు నేలకొరిగాడు దానికి కారణం ఇతనికి తనకంటే ప్రాజ్ఞుడు లోకంలో లేడనీ గర్వం కారణంగో చెపతాడు. నకులుడు నేలకొరిగాడు "తనకంటే అందగాడు, రూపాతిశయం ఉందనే అహం కలవాడని అంటాడు.ద్రౌపదితో పాటు తమ్ములు నేలకు ఒరగడంవల్ల కలిగిన బాధతో అర్జునుడు నేలకొరిగిపోతాడు. "కారణం అతడు కౌరవులనందరనీ ఒక్కరోజులో యుద్ధరంగంలో తెగటారుస్తానని అలా చేయలేకపోతాడు. ఎందరినో కోదండధారులను నిర్లక్ష్యంగా చూస్తాడు. అందుకే ఇలా జరిగిందని" ధర్మరాజు చెప్తాడు.
ఏదొక లత తగిలనట్లు భీమడూ నేలకొరిగాడు. "భోజనప్రియుడు, ప్రచండ బలాఢ్యుడై ఎవ్వరినీ లెక్క చేయక ప్రగల్భాలు తరచు పలుకుతూ ఉండడం" వల్ల తనువు చాలించాడు. చివరకు ఒక కుక్క మాత్రమే ధర్మరాజు వెంట వస్తుంది.ఆ కుక్కని విడిచి పెట్టి ఇంద్రలోకానికి రమ్మని ఇంద్రుడు ఆహ్వానిస్తాడు.ఇంతవరకూ తనను నమ్మి వచ్చిన కుక్కను వదలి రానంటాదు. చివరకు ధర్మరాజుయొక్క సత్య సంధతకు మెచ్చి కుక్కె దర్మ దేవలా వచ్చిందని చెప్తాడు.
దేవతల రాజు ఇంద్రుడు వచ్చి ధర్మరాజుని ఇంద్రలోకం రమ్మని ఆహ్వానిస్తాడు. దేవలోకంలో ముందుగా కర్ణుడు కనిపిస్తాడు. అన్ని విషయాలు గురుకు వచ్చి ఇంద్రునిడిని అడుగుతాడు. ఒకొక్కరి విషయాలు ఇంద్రుడు వివరిస్తాడు. సీతదేవిగా, ఇంద్రసేనగా ,అపరలక్ష్మి గా, ద్రౌపదిని వివరిస్తాడు.ఇక్కడ వ్యాసభారతంలో ఇన్ని కథలు లేవు.సీత విషయం అందులో లేదు.రచయిత్రి సృష్టి మాత్రమే.
తరువాత అంశాలతో మరోసారి. సరేనా..

స్వీటీ
స్వీటీ మధురమూ మనసా
కలవరమూ సొగసామాటల అధరాలూ
మరుని బాణాలూకాంచన కాయం
వంచలేని వయ్యారం
పూలదెబ్బలు కావివి వాలుకంటి మబ్బులు
ఇవి మచ్చలు కావివి చంద్రుని సొగసులు
ఎన్నోరుతువుల సుమాల కుమారీలు
నీ కురులు నీ స్పర్శ కమనీయం
మనోహరాల హరివిల్లులు
పాలమీగడలు పంచదార చిలకలూ
అందాల గులాబీలు నీ సొయగమపు పార్లర్లు
స్వీటీ నీ పేరే అమృతం
నీవే కమనీయం
ఎన్నొరోజుల బంధం
ఆరోగ్యాల ఆనందం
కలవరమూ సొగసామాటల అధరాలూ
మరుని బాణాలూకాంచన కాయం
వంచలేని వయ్యారం
పూలదెబ్బలు కావివి వాలుకంటి మబ్బులు
ఇవి మచ్చలు కావివి చంద్రుని సొగసులు
ఎన్నోరుతువుల సుమాల కుమారీలు
నీ కురులు నీ స్పర్శ కమనీయం
మనోహరాల హరివిల్లులు
పాలమీగడలు పంచదార చిలకలూ
అందాల గులాబీలు నీ సొయగమపు పార్లర్లు
స్వీటీ నీ పేరే అమృతం
నీవే కమనీయం
ఎన్నొరోజుల బంధం
ఆరోగ్యాల ఆనందం
Subscribe to:
Posts (Atom)