Thursday, May 5, 2011

అందరం బాగుండాలని అనుకోడం... తప్పేనేమో!?

నేనో చేత కాని దళితుణ్ణి

పట్టు పరుపుల మంచం

తూగుటుయ్యాలలు నాకు అసలే తెలీదు

తినడానికి తిండీలేక

చదువుమీద మోజు తీరక

దగ్గుతూ ఊడిన ముక్కుతో

జీర్ణించుకోలేక

దినమొక యుగంలా

తద్దినానికి దూరంగా...

వేదమంత్రాలు నేర్చుకోక

అగ్ర వర్ణాల చాటున అధమంగా

శుభ్ర వర్ణంగా, చేతకాని వాడిగా

జీవిస్తునే ఉన్నా బ్రతకలేక !?

కులం ఎవ్వరిది? మతం ఎవ్వరిది?

ఎవ్వడు లబ్ధి పొందాడు ఈ కులంతో

గోకులం పోయింది బృందావనం గడిచింది..

వసంతాలు, సంతలు చెప్పుకోవడాలు

మారినా

ధనపరంగ ఎదిగింది ఎవ్వరు ?

మతమన్నది మాయగా ఉంటే

ఆ మాయకు కారణమెవ్వరు ?

గుండె పగిలినాక రోదిస్తే, ఆ పాపం ఎవ్వరికి?

ఆ మతం ఏ కాలానిది ?

నే నొక్కటే అడుగుతున్నా

నే నోక చేతకాని దళితుడిని

అగ్ర వర్ణంగా పుట్టిన అధమ వర్ణాన్ని

నేనంటే నీకు ఒక పిలకగా కనిపించవచ్చు

నా మతం సనాతన ధర్మం.

నా ఇల్లే అగ్ని హోత్రం.

ఈ జన్మలో దాన్ని జీవచ్చవంలా ఉన్న

నామీదా నీ ప్రతాపం ?!

ఒకే ఒక్క మాట గుర్తు పెట్టుకో

కాలమా …

నాకళ్ళు నిప్పులు కురిపించక ముందే

నాకాళ్ళకు బలం వస్తుంది

నా గొంతు బలీయం అవుతుంది

నాకు నా బాధలు తెలుసు

నీతో పంచుకుందామని ఏన్ని సార్లు చెప్పినా

వినవా నువ్వు ?

నా మనసుతో చూడు

నేనొక భాషా సమాజానికి వారసుణ్ణి

నా హృదయం ఓ మండే కొలిమి

నా గొంతు బారెడు పదునైన కత్తి

కానీ నేనింకా సమాజానికి పురోహితుణ్ణే

అందరం బాగుండాలని అనుకోడం

తప్పేనేమో!?.

1 comments:

voleti said...

very nice post... Truth