Wednesday, July 2, 2008

ఒంటరి పోరాటం


నడుస్తున్న జీవనయానం
ప్రతీదీ నా వెంటే రావాలని
ఎదురుచూపుల ఎండమావులు
తరంగాల మత్తు నిద్ర

నేనెవరూ.. తేలుసుకునే లోపే
మతమార్పిడుల అండమాన్లు
మతితప్పి శ్రుతిలేని ఒంటరి
బాటసారి పయనం ఎంతవరకు ?

నింగితో పోరాడుతునే
నేలకోసం నల్లా కోసం
గతి తప్పుతున్న ఈ జీతం
ఎంతగాని ఈ ఒంటరి పోరాటం

0 comments: