రాగాలు పలకలేని రోగం నాది
విరిసే పువ్వు నవ్వు ఒక్క సారి అంటే
నిప్పులు కురిపే కాలమిదని కాదు పొమ్మంది
నవ్వు తున్న ఆకాశం కాలుదువ్వు తూంది
కంప్యూటర్ రాక్షసి కాటేయ్యాలని కూచుంది
కడుపుమండి కార్లు పరుగులేడుతున్నాయ్
చెట్లు దిక్కులేక తిరగబడక ఏడుస్తున్నాయి
రాత్రులు పనిలేక, పగలు తిండిలేక
దినం తీరలేక, ఎండమావి జీవితం
నారుపోసేవాడు నీరుపోయలేక ఎండిన
మోడు వారిన దివ్య విగ్రహం నా రూపం
నేనంటే కలిమికి కర్కశం నా పేరే దైన్యం
బాధపడిన ప్రతిసారి ఓదార్పు నా ఊపిరి
తిండిలేని దినం తిరగలేని గతం శతం
నేడూపిరై పీలుస్తున్నా కాలుష్య వర్తమానాన్ని
కారాదని ప్రయత్నిస్తున్నా భాగ్యపు శతాన్ని
0 comments:
Post a Comment