Tuesday, January 15, 2008

ఆశావాదం


అన్నీ ఉన్నాయి కావల్సింది తప్ప
ఇంతకీ ఏది కావాలో నాకు తెలీదు
ఎన్నో యేళ్ళుగా చదువుతునే ఉన్నా
అవసరాలకు డబ్బు ఆనందానికి స్నేహితులు
కాలం తెలీదు చదువుతున్నప్పుడు
ప్రేమలో పడినప్పుడు

సంపాదించడం తేలికే అంటారు
కాని ఎలా సంపాదించాలో తెలీదు
కుర్రకారు సరదాలు తీరేదెప్పుడు
ఏమిటో ఆనందమని పేరుకే గాని
తృప్తిలేని జీవితం అంతులేని ఆశ
తత్త్వం చదివినా, డిగ్రీలు పూర్తయినా
సమగ్రతలేని పాండిత్యం పనికిరాని శరీరం
ఏదో చెయ్యాలనే తపన
ఎందుకూ పనికిరాని నిరాశ
పెద్దలు చెప్పడానికే ఇబ్బంది పడే
సమస్యల వలయాలు

దినదినం కోట్ల వ్యాపారం
రోజుకో కొత్తజబ్బుతో నరకం
వెరశి నాపేరు ఆశావాదం

0 comments: