Monday, January 7, 2008

తెలుగు చదివిన విద్యార్థీ .. నీ గమ్యం ఏది?

తెలుగు చదివిన విద్యార్థీ .. నీ గమ్యం ఏది?


ఉద్యోగం చేద్దామని సిటీకి వస్తే
ఏ ఉద్యోగం కోసం వెళ్ళినా
అనుభవం ఉందా? అనే ప్రశ్నే తప్ప
ఉద్యోగం యిచ్చే నాథుడే లేడాయే


తిరిగితిరిగి చెప్పులరిగిపోయాయి
పేద ఆడపిల్లకి వెదికే సంబంధంలా
నాకు ఈ సిటీ ఉద్యోగాన్ని యివ్వలేదు
ఎందుకంటే నే చదివింది తెలుగని

ఎంగిలిషులో తిట్టినా అందంగా ఉంటుందని
ఆ ఎంగిషు రాక పోతే తెలుగు చెప్పే లేవని
దిక్కులేక ధనంలేక తెలుగు చదివానని
ఎన్నిఎన్ని మార్లు బాధ పడాలి

నీతి అంటే చాతకని తనమని
చదువు అంటే కంప్యూటరనీ
తెలిసే నాటికే ఆ భాషలు మారిపోతున్నాయి
సంస్కృతం చదివితే కార్పోరేటర్ కరుణిస్తుందని

ఉన్నడబ్బు అప్పుల డబ్బుతో ఎలాగో ఈడిస్తే
ఖర్చు నాలుపదులు, ఉద్యోగం వస్తే రెండునాళ్ళు

ఓ విద్యార్థి! చదువుకోసం కష్టపడేకన్నా
పది గోవులు కాసుకున్న పాలో పెరుగో
ఇది నడుస్తున్న చరిత చెబుతున్న వాస్తవం

ఎన్నో డిగ్రీలు చదివే కన్న
నీ రికమండేషన్ నీ మూతికట్టు మని
నీ జీవితాన్ని మార్చే రోజుల రాజులివి

నీ కులం అడుగువర్ణమైన ఓఖే
కమ్మ కాపువంటి అధికవర్ణమైన ఓఖే
దిక్కుమలిన బ్రాహ్మణ వైశ్యాదికులంలో ఉండకు
నువ్వు మతం మారినా నిన్ను వెలివేస్తారు

ఈ కాలం మారేనా? ఈ చదువు ఉద్ధరించేనా!?
ఈ కాలం కరుణించేనా! నా బతుకు నిలిచేనా?
ఎన్నేళ్ళిలా...? జీవించలేక మరణించేనా?

3 comments:

యువరాజు said...

నారు పోసిన వాడు నీరు పోస్తాడనే ఆశే గదా మనుష్యుల్ని బ్రతికించేది!

Jada Seetapati Rao said...

యువరాజ్ గారు మీరు చెప్పింది నిజమే. కానీ , తెలుగు భాషవల్ల ప్రయోజనం చాలా తక్కువని నా ఉద్దేశ్యం. ధన్యవాదాలు- నా బ్లాగు చూసినందుకు, కామెంట్ చేసినందుకు కూడా .

యువరాజు said...

రావు గారూ మీరు చెప్పింది వాస్తవం. ప్రపంచంలో చిన్న చిన్న దేశాలు కూడా తమ భాషకు ప్రత్యేక స్థానాన్నిస్తూ తమ సంస్కృతిని కాపాడుకుంటున్నాయి.అయితే తెలుగు వారి బలహీనత మొదటి నుండీ పరభాషావ్యామోహమే!