Friday, January 4, 2008

అందం అంటే ...?!

అందం అంటే ...?!
మనసా తెలుసా నీకిది
ఆలోచనలో నీవే ఆరాటంలో
నీవే నే నంటే నీ కెందుకో
అంత అది స్వప్నంలో కనిపిస్తూ
ముత్యంలో కదిలాడే సౌందర్య నయనా
నీకిది న్యాయమాఉద్యోగాలపేరిట పెళ్ళిని
వాయదవేస్తూకళ్ళెదుటే కనబడి
మాయమై పోతే ఏమనాలి

ప్రేమకి పర్యాయ పదాలక్కర్లేదు
నీ మాట నీ గుర్తు నీ స్పర్శ
అన్నీ అనుభూతులే
కదిలించే శక్తే నీవు

నమ్మలేవా నేస్తమాఅందం అంటే
కేవలం ఆకర్షణ కాదని అందాన్ని
చెప్పేదే హృదయమని నిన్ను చూస్తేనే
తెల్సిందినీ మాటలతోనే పరిచయమైంది

జన్మజన్మల పరిచయమే పెళ్ళని
నే నమ్మను గాని, భార్యే అనురాగానిస్తే
అదే స్వర్గమని నమ్ముతా

అమృతం వల్ల చవంటే తెలీదుకాని
నీ అధరామృతం వల్ల
చైతన్యమే వస్తుంది సుమా

0 comments: