Tuesday, December 4, 2007

వెనుక... ఏముంది!

ఏదైనా మంచి జరిగితే వెనుక ఉన్నది ఓ శక్తే..
మగాడి వెనుక ఆడది ఉంటే
ఆడదాని వెనుక మగాదు ఉండడా?
కారణం? అణగ ద్రొక్కే తనం?

కాదంటారా? అలా కాకపోతే ఆనందమే ...
మబ్బు చాటున దాచివేద్దామని
కాంతిని అబలగ చేయడం ఎంతవరకు?

మట్టికి,మనువుకి తేడాలేదా?
కష్టానికి ఇష్టంతో పనిలేదా?

ఆనందాన్నిచ్చే భార్య, అర్థం చేసుకొనే భర్త!
ఎన్ని పెళ్ళిళ్ళు జరిగాయి?ఎన్ని కన్నీళ్ళు ఒరిగాయి?

ఏ తరం బాగు కోసం సంపాదిస్తున్నారో!
ఉద్యోగాలపేరన కయ్యాల కాపురాలెన్నో?
ఫెషన్ పేరిట పట్టని నీతుల చదువుల నవతరం
కాని పనికి వస్తోంది నవతరం దోచుకోవడానికి
ఏ ఉద్యోగం వస్తుందో వెక్కోవడానికి
పదిజతల చెప్పులు ముప్ఫై యేళ్ళు
వెరశి జీవితం నాలుగు అక్షింతలు

రచ్చ బండలు మెచ్చని వియ్యాలు
కవిత్వం వినడం రాయడం కన్న
ఉన్నతస్థాయిని వెతుక్కోవడం మిన్న
ఇది నేటి తెలివైన వారి ఆలోచన

సంస్కారం అంటే
నమస్కారాల మస్కాలుగా నేటి యువతరం
వీటన్నిటి వెనుక ఉన్న బలియమైన శక్తి ..
పేదరికమా..? కులతత్త్వమా..?స్వార్థమా..?
ఏది..? నీ ఊహ వద్దు చూడు వాస్తవం..

1 comments:

రాధిక said...

చాలా బాగుందండి.మీరు చివరిలో వేసిన ప్రశ్న కి నేనిచ్చుకునే సమాధానం ఒక్కటే ఇప్పటివారికి తృప్తి అంటే తెలియకపోవదం,వున్నదానిని అనుభవించడం రాకపోవడం.ఇందుకు నేనూ అతీతురాలిని కాదు.ఆ తానులో ముక్కనే.