Tuesday, December 18, 2007

మధ్య -- మంద హాసం

మధ్య తరగతి మంద హాసం
మబ్బువీడని మతం కులం

పురోహితుడిగా చెలామణీ
జేబులో లేని కాణీ
పేరుకు అగ్రవర్ణం
బతుకులేని జీవనం

వృత్తులు మారిన మతాలు మారినా
నుదుటిపై నెత్తుటి గీత మతం కులం

ఎన్నాళ్ళీ జాడ్యం? ఎన్నేళ్ళీ కులం?
తరాలు మారాయి దినాలు మారాయి
నేటి దినం తీర్చే దెవరు?

సంకరం సంగమం ఉన్నా
ఏ కులమని నీ బోడి ప్రశ్న

ఊర్లలో మొదలై విశ్వ విద్యాలయాలకు
ఓట్లతో మొదలై రాజకీయలకు చేరినై
దేవుళ్ళకు ప్రాకినై ఇంకా ఎన్నెళ్ళు?

కులం పేరుతో మారణ హోమం
సిగ్గు లేదా మనిషివని చెప్పడానికి

నీకు తెల్సు దాన్ని ఎలా ఉపయోగించాలో
కుతంత్రాలు మాని మనుగడ చెయ్

కలకాలం కుళ్ళులేని మనిషిగా
మానవత్వంతో మరో అదర్శం నీవవ్వు

1 comments:

రాధిక said...

చాలా బాగా రాసారు.కులం కుళ్ళు శుభ్రం చేయడానికి దిగిన ప్రతి ఒక్కడికీ అంటుకుని వాళ్ళని కూడా మిగతా వాళ్ళతో కలిపేస్తుంది.మనమేమి చెయ్యగలం?