నీ నళినదళ పద్మ నేత్రాలు చూడక
నీ స్నేహపు మరందాలు గ్రోలక
తనివి తీరని సొగసులు తాకక
ఎన్ని రోజులో గడపలేక..యిలా?
మాటలో చెప్పలేక దిక్కు తోచక
దీనంగా తిండి సరిగా సహించక
ముద్దముద్దకీ నీ ఆలోచనల బరువుతో
దీనంగా నీరసంగా బ్రతకలేక.. ఎలా?
రతీదేవి శచీదేవి విరహావస్తలో ఎలావున్నరోదిక్కు తోచక లక్ష్మీ అనుగ్రహంలేక
బండబారిన జీవితపు ఉద్యోగ
పరమార్ధకత దొరకని దీనత్వంలో.. ఏం చేయను?
ని కరగ్రహణంతో అర్థమైందీ
కష్టబడనివాడు బ్రతకలేడనీ
ఇష్టబడే వానికి కష్టాలు తెలీవని
యవ్వనపు ఆకర్షణ మనిషిని
పాడుచేయదనిప్రేమ ద్వేషన్నివ్వదనీమరణం ప్రేమకు జవాబుకాదనీ
మబ్బువీడిన చంద్రుడే ప్రేమనీ
ఎప్పుడు తెలుసుకుంటుందీ లోకం!
ఓ భగవాన్!, నీవు ప్రేమనిచ్చేముందె
కాస్తంత ధైర్యాన్నివ్వు, అర్ధంచేసుకోనివ్వు
వాస్తవాన్ని లక్ష్యాన్నివ్వు చేదింపజెయ్యు
ప్రేమికులకిదే నిజమైన ప్రేమికులరోజు

0 comments:
Post a Comment