నా బ్లాగు దర్శించినందుకు ధన్యవాదాలు .. ఈ బ్లాగులోని రచనలన్నీ నా స్వంతం. చదవండి, ఆనందించండి. బాగుంటే మీ కామేంట్ రాసి పోస్టు చేయండి ధన్యవాదాలు. మిస్ యూజ్ చేయకండి.
Sunday, November 25, 2007
మతం-విశ్వాసం- అనుభూతి
మతమంటే కొన్ని నియమాలను ఏర్పాటు చేసుకుని ప్రవర్తించేది. ఎక్కువగా నీతులు హితోపదేశాలను వర్లివేసేదని ఒక వివరణ. మొదట్లో కలసి కట్టుగా ఉండడానికి ఉపయోగపడేది. కాలం మారుతున్న కొలదీ అందులో కూడా అనేక మార్పులు వస్తునే ఉన్నాయి. ఈ మార్పుల్ని కొన్ని మతాలు తమలో యిముడ్చుకుంటున్నాయి. అందులో ఈది గొప్ప అనే కన్నా, అందులో నీతిని తీసుకోవడం మిన్న. మతానికి సంబంధించిన గ్రంధాలు ఎలా ఉన్నాయి? ఎలా ఉండాలి? అని ప్రశ్న వేసుకోవాలి.బైబులు ఖురాన్ మొదలైన మతగ్రంధాలు ఎన్నో విషయాలు చెప్పాయి. వాటిలో ముఖ్యమైనవి కట్టుబాట్లు, అప్పటి స్థితిగతులు , పార్థనలు, వగైరాలు. హిందూ మత విషయంలో ముఖ్యంగా భారత భాగవత గ్రంధాలలో ఎక్కువ రసానుభూతి, కలుపుకోనే తత్త్వం, నీతి నియమాలు , ప్రవర్తనాంశాలు, కధలూ, ఉపకధలూ, సాంఘిక జీవనం మొదలైనవి కనిపిస్తాయి. మతం యొక్క మౌళిక రూపం విశ్వాసం. అంతకన్న విశ్వాసం లేనిదే మనుగడ లేదని చెప్పాలి. అందుకే అమ్మను విశ్వాసం తోను, నాన్నను నమ్మకం తోను పోలుస్తారు. విశ్వాసం, అనగానే మతనికి సంబంధించిన విషయమే ననుకోనక్కర్లేదు. ప్రకృతికతీతమైన అనేక విషయాలను గురించిన నమ్మకాలకు, కార్యకలాపాలకు ఇది విస్తరిస్తుంది. ఉదాహరణకు మనకు కొన్ని సిద్ధాంతాలపట్ల విశ్వాసం కలగవచ్చు, అవి ఏ ఒక్క మతానికో పరిమితమైన సిద్ధాంతాలు కాకపోవచ్చు. మార్క్సిజం తొలిదశలో, కొందరిలో కనిపించిన సామూగిక విశ్వసం, దాస్యభావాలతో కూడిన పాక్షిక మతోద్వేగ శాఖను గురించి ఇక్కడ ప్రస్తావించుకోవాలి. యూదులు, క్రైస్తవులకు తమ ప్రవక్తలు బోధించిన సూత్రావళితో కొందరు మార్క్సిస్టుల సిద్ధాంతాలకు గల సంబంధాన్నింకా మన అర్థం చేసుకోవాలి. అనాది జలప్రళయ గాధను వ్యతిరేకించిన మహా పురుషుడి అవశేషంలా పదిలపరచి, నేటికి కూడా లెనిన్ బౌతిక కాయన్ని ప్రదర్శించడం వల్ల సాంఘిక సమానత్వం మీద ప్రజల విశ్వాసం సన్నగిల్లుతోందనిపిస్తోంది. విశ్వసం అనిర్వచనీయమైంది. కోరిక, శ్రద్ధ, భక్తి వంటివి చేతల్లోనూ, ప్రదర్శనల్లోనూ , ఉపాసనలోను,వ్యక్తం చేయవలసిందేకాని ఆ పదాలకు అర్థవివరణ చేయడం సాధ్యంకాదు. నిజానికి లౌకిక వాదులకూ ,సంప్రదాయవాదులకూ మధ్య జరిగి ఘర్షణకు మతసిద్ధంతాలే ప్రాతిపదికలైనా వారి సమైక్యతకు దారితీసే కారణాలు కూడా అవే. ఇక అనుభూతి అనేది ఒక మానసిక ప్రక్రియ. ఇది అనేక విధాలుగా అనిప్స్తుంది. ఒక రకంగా ఆ క్రియలో మమేకం అవడమే. ఇది కూడా ఒక మాటలో చెప్పే అంశం కాదు.దీనికి పరిధులు లేవు, వర్ణనలు చాలని అంశంగా చెప్పకతప్పదు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment