అనుకోకుండా ప్రత్యక్ష్యమయ్యాడు పతంజలి
అంజలి చేసి ఆతిధ్యమిచ్చా..
మోక్క్షం కోసం మరిన్ని ప్రశ్నలేసా..
జవాబుకు బదులు చిరు నవ్వు
ఏకాగ్రత మనోనిగ్రహం ఆ నవ్వులోనే
ఒక్క బిగిని ఊగినట్ల్యైంది
ఏవరు చెప్పారు సమాధానం?
చదువుకుంటూపోయా సాధనావస్థ
ఆటంకాల పరీక్షలు అభ్యసన అసమగ్రదారులు
కైవల్యం దరి చేరేలోపే సిద్ధుల గోల
ఇష్టాన్నములు తయారైనవి
ఏమిటో తెలియవు ,వేడీ చల్లని
భేదం లేదు, రుచి ప్రమేయం లేదు
ఇంకా కైవల్యం కష్టంగానే తోచింది
"ముక్తికై మనిషి సమస్తం వదలాలి"
జీవం ఆత్మ 'శరీరం భేదాలూ
ఆత్మకు శరీరం ఆధారం
ప్రకృతి దాటితే అతీత శక్తులు
ప్రలోభపెట్టే ప్రతివస్తువూ ప్రత్యక్షం
ఏకాగ్రత, స్థైర్యం, విరాగం
ముముక్షత్వపు సోపానాలని తెలిసాయి
పతంజలిమాయం...అంతాచీకటి
గమ్యం తెలియని అరణ్యం
సంసార యాతనా కూపాలు
బయటపడే మార్గమే పతంజలియోగం
స్వత:సాధన , విభూతియోగాలు
"మోక్షద్వారాలు"
Tuesday, September 25, 2007
Subscribe to:
Post Comments (Atom)

1 comments:
try rto make fit
Post a Comment